డా. సామాన్య గారు , మీ సంపాదకత్వం లో వచ్చిన ` 2012 ప్రాతినిధ్య కథ 'చూశాను. అందులోని కథలు గతం లో చదివినవే ఐనా సంపుటిగా వచ్చింది కనుక కొనడం జరిగింది. ఎప్పటిలానే అఫ్సర్ గారి ముందుమాట ను అర్థం చేసుకొనే తెలివితేటలు నాకు లేవు.[ స్కైబాబ గారి అధూరే కి ముందు మాట కూడ అంతే.] యిక కథలలోనికి వస్తే పసునూరి రవీందర్ గారి కథ యిందులో చోటు చేసుకోవటం గురించే నా అభిప్రాయం చెప్పాలి. రవీందర్ గారి కథలు సమాజంలో దళితులపై కనబరుస్తున్న వివక్షను , స్వాతంత్ర్యం వచ్చి యిన్ని సంవత్సరాలైనా ఈ వివక్ష కొనసాగుతుండడంపై ఆవేశాన్ని తన కథా వస్తువుగా స్వీకరించి అధ్బుతంగా వ్రాస్తారు.అందుకు రుజువు మీ సంపుటిలోని ` అవుటాఫ్ కవరేజ్ యెరియా" , ఆదివారం ఆంధ్రజ్యొతిలో [03-02-2013] ప్రచురించబడ్డ ` మీసాలోడు" కథలు. కాని రవీందర్ గారిలో మరో కోణం చూడాలి. వారి సంపాదకత్వంలో వచ్చిన కవితా సంపుటులు ` జాగో- జగావో" , ` క్విట్ తెలంగాణా ", ఆయన దీర్ఘ కవిత ` లడాయి" లో రవీందర్ గారు వ్రాసిన కవితలను ఒకసారి చూడండి. రవీందర్ గారు డాక్టరేట్ పుచ్చుకున్నరని తెలిసింది. మేధావిగా ఆయన గొప్పవారై వుండవచ్చు. కాని వ్యక్తిగా ఆయన భావాలు నేల బారువి. తెలంగాణా సాధించడం అన్నది వారి చిరకాల వాంచ. దానిని కాదనే హక్కు యెవరికి లేదు.వారి పోరాటం ప్రజాస్వామ్యయుతంగా , రాజకీయం గా సాగాలి.కాని యిక్కడ బూతు కవితలతో సాటి మనుషులను నిందించడం యెంతవరకు సమంజసమో మీరే చెప్పాలి. స్కైబాబ గారితో కలిసి రవీందర్ గారు సంపుటీకరించిన ` క్విట్ తెలంగాణా" లోని కవితలు చదివి అసహ్యించుకోని వారు లేరు. దళితులపై జరుగుతున్న వివక్షకు , అగ్ర కులాలవారు వాడే భాష గురించి బాధపడుతూ కథలు వ్రాసే రవీందర్ గారు తను వ్రాసే కవితల్లోని భాష గురించి యేమంటారు ? అది కూడా యితరుల మనసులను గాయపరుస్తుందని అనిపించదా? సమకాలీన రాజకీయాలను అర్ధం చేసుకొని , దోపిడీదారులను గుర్తించి పోరాటం సాగించాలి గాని యిలా దిగజారుడు కవితలు వ్రాయడం సమంజసం కాదని నా వుద్దేశ్యం. అందుకే ఆయన కథకుడుగా గొప్పవారే గాని వ్యక్తిగా ఆయన భావాలు సరైనవి కావని నా భావన. మీరు కూడా ఒకసారి ఆ కవితా సంపుటులను చదవండి. -- పి. జయప్రకాశ రాజు.
డా. సామాన్య గారు , మీ సంపాదకత్వం లో వచ్చిన ` 2012 ప్రాతినిధ్య కథ 'చూశాను. అందులోని కథలు గతం లో చదివినవే ఐనా సంపుటిగా వచ్చింది కనుక కొనడం జరిగింది.
ReplyDeleteఎప్పటిలానే అఫ్సర్ గారి ముందుమాట ను అర్థం చేసుకొనే తెలివితేటలు నాకు లేవు.[ స్కైబాబ గారి అధూరే కి ముందు మాట కూడ అంతే.] యిక కథలలోనికి వస్తే పసునూరి రవీందర్ గారి కథ యిందులో చోటు చేసుకోవటం గురించే నా అభిప్రాయం చెప్పాలి.
రవీందర్ గారి కథలు సమాజంలో దళితులపై కనబరుస్తున్న వివక్షను , స్వాతంత్ర్యం వచ్చి యిన్ని సంవత్సరాలైనా ఈ వివక్ష కొనసాగుతుండడంపై ఆవేశాన్ని తన కథా వస్తువుగా స్వీకరించి అధ్బుతంగా వ్రాస్తారు.అందుకు రుజువు మీ సంపుటిలోని ` అవుటాఫ్ కవరేజ్ యెరియా" , ఆదివారం ఆంధ్రజ్యొతిలో [03-02-2013] ప్రచురించబడ్డ ` మీసాలోడు" కథలు.
కాని రవీందర్ గారిలో మరో కోణం చూడాలి. వారి సంపాదకత్వంలో వచ్చిన కవితా సంపుటులు ` జాగో- జగావో" , ` క్విట్ తెలంగాణా ", ఆయన దీర్ఘ కవిత ` లడాయి" లో రవీందర్ గారు వ్రాసిన కవితలను ఒకసారి చూడండి.
రవీందర్ గారు డాక్టరేట్ పుచ్చుకున్నరని తెలిసింది. మేధావిగా ఆయన గొప్పవారై వుండవచ్చు. కాని వ్యక్తిగా ఆయన భావాలు నేల బారువి.
తెలంగాణా సాధించడం అన్నది వారి చిరకాల వాంచ. దానిని కాదనే హక్కు యెవరికి లేదు.వారి పోరాటం ప్రజాస్వామ్యయుతంగా , రాజకీయం గా సాగాలి.కాని యిక్కడ బూతు కవితలతో సాటి మనుషులను నిందించడం యెంతవరకు సమంజసమో మీరే చెప్పాలి. స్కైబాబ గారితో కలిసి రవీందర్ గారు సంపుటీకరించిన ` క్విట్ తెలంగాణా" లోని కవితలు చదివి అసహ్యించుకోని వారు లేరు.
దళితులపై జరుగుతున్న వివక్షకు , అగ్ర కులాలవారు వాడే భాష గురించి బాధపడుతూ కథలు వ్రాసే రవీందర్ గారు తను వ్రాసే కవితల్లోని భాష గురించి యేమంటారు ? అది కూడా యితరుల మనసులను గాయపరుస్తుందని అనిపించదా?
సమకాలీన రాజకీయాలను అర్ధం చేసుకొని , దోపిడీదారులను గుర్తించి పోరాటం సాగించాలి గాని యిలా దిగజారుడు కవితలు వ్రాయడం సమంజసం కాదని నా వుద్దేశ్యం.
అందుకే ఆయన కథకుడుగా గొప్పవారే గాని వ్యక్తిగా ఆయన భావాలు సరైనవి కావని నా భావన.
మీరు కూడా ఒకసారి ఆ కవితా సంపుటులను చదవండి. -- పి. జయప్రకాశ రాజు.